Tuesday, April 26, 2022

ఇరన్న (పతంజలి వస్తువులు విక్రయాలు మొదలైనప్పుడు సరదాగా వ్రాసినది)

[2/15/2018, 8:15 PM] Anuradha Anu: గౌరి ఒసేయ్ గౌరి ఏంటి ఇనపడ్త లేదేంటి గౌరి తడిక తెరిచి చూసింది ఎదురుగా ఇరన్న , ఎందుకోచాడు? నా తానా డబ్బులు లేవు లేవన్న ఇనుకొడు ఉన్న డబ్బులు పొద్దుటేలా పిల్లోడి ఫీజు కట్టిన ఏమిసేయల, ఇననట్టు మూల ఉన్న సిపురు తీసి ఉడుస్తోంది .
అదేంటే ఇననట్టు ఏంది పని  , 
చెట్టు అంత మడిసిని అవుపడ్త లేను నీకు, నా మాట ఇన పడ్త లేదా? ఇన పడతానే ఉంది గొంతులో గారం, ఆవు పడతానే ఉన్నావ్ తెల్లటి చొక్క, తెల్ల లుంగిను ఈ సారి ఇరన్న ఖంగారు మడిసిని కాక బట్టలు ఒకటే కనిపిస్తున్నాయ , 
ఏంటి గౌరి కి , నా తొని కాక ఎవరితోనో ఉతికి ఇస్తున్నావ్? అదేంటీ నే కనిపిస్తాలేన?
[2/15/2018, 8:15 PM] Anuradha Anu: అంది గౌరి
[2/15/2018, 8:51 PM] Anuradha Anu: అని ఇరన్న, డబ్బులకే వచుంటాడు సచినోడు, ఆ ఇన్ని మాటల్లో పెట్టి పంపిచేయల, ఆ ఏమంతావు, అద్నే కనిపిస్తాలేన అని, ఆ ఆ కనిపిస్తున్నావ్ , సెప్పనైతివి కొత్త సాకలిని పెట్టినవా? ఇదేందీ ఇది కొత్త సాకలి అంట దేంటి, కుకొ మనవ నను , నిన్న బాబా గుడి తాన కుసున్నవు గందా ఎన్ని డబ్బులు వచినాయో అడుదావని వచిన ,
[2/16/2018, 3:05 PM] Anuradha Anu: డబ్బుల! ఏడునాయి అంత ఖరు‌‌సైపొయినాయి . కూలి దొరికిన రోజున కూలి సేతుండ దొరకని రోజున బిఛమెతుతున‌২ ‌అక్కడ కూడా కుకొవాలన సగం సోటు చూపినోనికి ఇయాల , అట‌‌২, ఊరిలో ఏనాడూ ఇంత సేటు లేదు ఈడ నీ మాట సాయం ఉంటాదని ఉంటునా২, పిలోడి ఫీజు కి 50రూపాయలు తక్కువయినాయి అది రాతిరేల కాబటి కుకున్నా 
అదేంది అమ్మి  నా కాడికి వస్తే నేనిద్దును గంద , రాపోతివి
[2/16/2018, 3:22 PM] Anuradha Anu: ఓలమ్మో ఓలమ్మో ఏమైనా ఉందా , అదేంటి అలగ ఆనెసినవు. నీ తాన కొద్దమని అనుకొన్న ,నీ ఆడమడిసి కి ఝడిసి రాలె మా చెడ్ద నోరు, ఎందుకు లే నీకు నాకు మద్దెన తగువు ఎడ్తది.ఏంటి కాల్లు పీకుతునాయి కుకొమనవ.ఊడిసిన కదా ఈడ కూసో,
[2/16/2018, 4:17 PM] Anuradha Anu: ఏంది ఇందాక ఏమన్నావు మరిసిన, కొత్త సాకలిని ఎట్టుకున్నావ అన్న,ఓర్ణి అదా అంత తెల్లగ మెరుస్తుండాద నా చొక్కా,లుంగి ఎటకారం కాదు కదా, ఎకసెక్కలాడటానికి, నీ ఇంటి దాన్న ఏంది, నిజమే సెప్తుండ, నిజమ గౌరి ,ఇదిగో మా పిల్లోడి మీద ఒట్టు‌,ఎలగెలగ అట్న, ఇరన్న సంబరం. అలగైతె నీ కూడ ఆట్టుకొస్త,ఆలగలగే, ఇదిగో మా పిల్లొనికి ఏదొ పాలల్లొ కలిపి ఇస్తే బాగుంటుందంట అది అట్టుకొచ్చిన నీకు కలిపిస్త తాగు,సరే 
ఇది తాగితే బుర్ర మంచిగా పని  చేస్తదంట సదువుకుంటున్నాడు  గందా అందుకు సరిసర్లె అస్తమానం నీకు కొడుకు ముచ్ఛటే, ఈ పాలి ఐయిన తొందరగా డబ్బులు ఇచ్చే, ఆలగలగే, అంది గౌరి .
సర్లే నే పొతుండా అంటూ లేచడు ఇరన్న, అదేందొ తెస్తనంటివి, తెస్తనే ,అంటూ అసలు ఇషయం చెప్పుకొచ్చడు సాకలి కాదే మా ఇంటి దే  ఉతికింది .మురిసిపోతు చెప్పడు .ఎట్టా !ఆశ్చర్య పోయింది గౌరి , ఊ...ఊ..మురిపెం కుసింత అసూయ పడింది గౌరి ,అదేందో పతంజలి షాపు అంటా ఆడకెల్లి  తెచ్చినాది  నీకూడ తెస్తలే ఆని లేచాడు ఇరన్న ఆ....ఆ..అంటూ నోరెల్ల పెట్టింది గౌరి .
ఎంత చక్కనిదొయి మా పెరటి తోట
ఎంత పరిమళమోయి మా తోట పూలు
పొద్దెక్కితె నేల రాలె పారిజాతం
బద్ధకించి కొమ్మనంటి ఉందెందుకో ||ఎంత||
 ఎర్రటి ఎండల మంటెక్కిస్తానని
ముందె ఎరుపై పూసిన మందారం||ఎంత||
సాయంత్రం అవుతూనె చల్లగా మెల
మెల్లగా పరిమళం మందించె సన్నజాజులు








తలఎత్తి చూడలే తప్ప కోయటానికి రాని తెల్ల గన్నేరు,పూల గుత్తి తలపించెల సెంటు మల్లి పద్మ లాంటి బొడ్డు మల్లి, మనీ అయితే లేదు కాని పెద్ద పెద్ద ఆకులతో పచ్చగా మురుస్తున్నా మనీ ప్లాంట్ పూస్తే నేను బోలెడు పూస్తా లేకపోతే ఒకటి అరా కాస్కో అంటూ కాగడా మల్లె విష్ణు చక్రాన్ని తలపించే ఒంటిరెక్క నందివర్ధనం ,అడవి తలపించే 🍌  గెలలతో అలరారుతూ , కరోనా అయిన కర్ఫ్యూ అయిన భయం లేదు పండు గా, కూరగా నేనున్నాను అంటూ అరటి తోట,  పూజకు మారేడు దళాలుగా బిల్వ వృక్షం, మీ అరచేతిని ✋ పండిస్తానని గోరింటాకు చెట్టు ఎప్పుడో వేసిన ఎదగడానికి తొందర ఎందుకు అంటుఅ నీరసంగా నిమ్మ 🌲 చెట్టు అలా, ఇలా,అవా ఇవా అని అనుకోకుండా ఫలం, పుష్పూం, తోయం అనుకుంటు అందరం ఒకే చోట ఉన్నామంటూ ఎంత చక్కని పెరటి తోట, తో డు

వికారి నామ సంవత్సరం వెళ్లి పోతు

పేరుని సార్థకం చేస్తు ప్రపంచాన్ని వణికించి

వెళ్ళింది.శార్వరి అంటే రాత్రి ,కాళి కాళికా

దేవి తన నాలుక తో  ఈ విశ్వాన్ని దడ

దడ లాడిస్తున్న విషపు రోగాన్ని తుడిచేస్తుందనీ

ఆశిస్తున్నా , ఈ ఉగాది శార్వరి అందరూ ఉ: ఉన్నత పరి శుభ్రత

పాటిస్తూ, గా:గాంధేయులుగా ఉంటూ, ది:దిశదశలు వెళ్ళక,

శా:శాశ్వత పరిష్కరం కోరుతూ, ర్వ:ర్వరితంగా సమసమాజ 

శ్రేయస్సుకై, రి:రీతిగా పాటుపడాలని కోరుతూ అందరికి

శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు.

శుభక్రుత్

ప్లవ నామ సంవత్సరంలో ఒడిదుడుకులు తట్టుకుని

విష రోగపు నీలి నీడల అలల పై తేలుతున్న పడవని

ఒడుపుగా తెడ్డుని అటు ఇటు వేస్తూ ఒడ్డున లంగరేసి పట్టుకొని

ఆహా తీరం చేరామ అని ఆనందంగా శ్వాస తీసుకొని

వడి వడిగా తీరం వెంబడి చూద్దును కదా శుభకృతి అని

నామ సంవత్సరాది ఎదురుగా అందరికి ఆహ్వనం పలుకుతూ భయమేమి వద్దని

అభయమిస్తా అంటూ జీవితం షడ్రుచుల సారమని

అందుకు నవవిధ భక్తిని ఆసరాగ చేసుకొమ్మని

పలికిన కోయిలను, వసంత గానం చేస్తున్న గ్రీష్మ ఋతువుని వెంట తెచ్చుకున్న శుభకృతి ఉగాదిని

చూసి ౘైత్రమాసపు పాడ్యమి తిధి మొదటి పండుగ మెట్టుపై చైతన్యపు అడుగు వేస్తూ ప్రతి మాసం అందరికి పండుగలు జరగాలని శుభాకాంక్షలతో శుభకృతి చైఅందుకొని దిగాను.