Tuesday, April 26, 2022

శుభక్రుత్

ప్లవ నామ సంవత్సరంలో ఒడిదుడుకులు తట్టుకుని

విష రోగపు నీలి నీడల అలల పై తేలుతున్న పడవని

ఒడుపుగా తెడ్డుని అటు ఇటు వేస్తూ ఒడ్డున లంగరేసి పట్టుకొని

ఆహా తీరం చేరామ అని ఆనందంగా శ్వాస తీసుకొని

వడి వడిగా తీరం వెంబడి చూద్దును కదా శుభకృతి అని

నామ సంవత్సరాది ఎదురుగా అందరికి ఆహ్వనం పలుకుతూ భయమేమి వద్దని

అభయమిస్తా అంటూ జీవితం షడ్రుచుల సారమని

అందుకు నవవిధ భక్తిని ఆసరాగ చేసుకొమ్మని

పలికిన కోయిలను, వసంత గానం చేస్తున్న గ్రీష్మ ఋతువుని వెంట తెచ్చుకున్న శుభకృతి ఉగాదిని

చూసి ౘైత్రమాసపు పాడ్యమి తిధి మొదటి పండుగ మెట్టుపై చైతన్యపు అడుగు వేస్తూ ప్రతి మాసం అందరికి పండుగలు జరగాలని శుభాకాంక్షలతో శుభకృతి చైఅందుకొని దిగాను. 






No comments:

Post a Comment